సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. వీసా రద్దు విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ జకోవిచ్ చేసిన అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో 21వ గ్రాండ్ స్లామ్ గెలుచుకోవాలన్న జకోవిచ్ ఆశలకు తెరపడింది. వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదన్న కారణంగా జనవరి 6న ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోవిచ్ వీసాను రద్దు చేసింది. అప్పటి నుంచి మెల్బోర్న్ లోని ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ హోటల్లో జకోవిచ్ ఉన్నాడు. వీసా కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని రెండోసారి వేడుకున్నాడు. అయినా ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతివ్వలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెళ్లిన జకోవిచ్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
Novak Djokovic loses Australian visa appeal: AFP
— ANI (@ANI) January 16, 2022
(file photo) pic.twitter.com/I3TNJltbM2
For More News..