యుఎస్ ఓపెన్ లో సంచలన ఫలితాలు కొనసాగుతున్నాయి. మూడో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్.. 24 గ్రాండ్ స్లామ్స్ ఛాంపియన్ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ శుక్రవారం (ఆగస్టు 31) మూడో రౌండ్ లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పాపిరిన్ 6-4, 6-4, 2-6, 6-4 స్కోరుతో జొకోవిచ్ పై గెలిచి తన కెరీర్ లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇటీవలే ముగిసిన వింబుల్డన్‌ల టోర్నీల్లో జొకోవిచ్ చేతిలో ఓడిన పాపిరిన్.. యుఎస్ ఓపెన్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఈ మ్యాచ్ లో 14 డబుల్ ఫాల్ట్‌లు చేసిన నోవాక్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 18 సంవత్సరాల తర్వాత తొలిసారి యూఎస్ ఓపెన్‌లో 4వ రౌండ్ కు చేరుకోవడంలో విఫలం అయ్యాడు. ఈ ఓటమితో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు.. కెరీర్‌లో 100వ టైటిల్ అందుకోవాలనే ఆశలకు తెరపడింది. ఇది నమ్మశక్యంగా లేదు. నా కెరీర్‌లో 15 సార్లు మూడో రౌండ్‌లో వరకు ఓడిపోయాను. జొకోవిచ్ పై గెలిచి నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించడం గొప్ప అనుభూతి. అని విజయం తర్వాత పాపిరిన్ అన్నాడు.
Also Read :- పారాలింపిక్స్ సెమీస్‌లో సుహాస్, నితీష్
ఇదే టోర్నీలో గురువారం (ఆగస్టు 30) టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మూడోసీడ్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో అల్కరాజ్ (స్పెయిన్) 1–6, 5–7, 4–6తో అన్‌సీడెడ్, 74వ ర్యాంకర్ బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడాడు. దీంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 15 వరుస విజయాలకు బ్రేక్ పడింది.
టాప్‌సీడ్ సినర్ (ఇటలీ) 6–4, 6–0, 6–2తో మిచెల్‌సెన్ (అమెరికా)పై, మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–2, 7–6 (7/5)తో మరోజెసెన్ (హంగేరి)పై గెలిచారు. విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ ఇగా స్వైటెక్ (పోలెండ్) 6–0, 6–1తో షిబహర (చైనా)పై, ముచోవా (చెక్) 6–3, 7–6 (7/5)తో నవోమి ఒసాకా (జపాన్)పై, పెగులా (అమెరికా) 7–6 (7/4), 6–3తో కెనిన్ (అమెరికా)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు. మెన్స్ డబుల్స్‌లో తొలి రౌండ్‌లో ఇండియా స్టార్