Australian Open 2025: నేడు జొకోవిచ్, అల్కరాజ్ బ్లాక్ బస్టర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

Australian Open 2025: నేడు జొకోవిచ్, అల్కరాజ్ బ్లాక్ బస్టర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో బ్లాక్ బస్టర్ సమరానికి రంగం సిద్ధమైంది. 22 గ్రాండ్ స్లామ్స్ వీరుడు నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌, సూపర్ ఫామ్ లో ఉన్న స్పెయిన్‌‌‌‌ యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో తలపడనున్నారు. రికార్డ్ స్థాయిలో 11 వ ఆస్ట్రేలియన్ పై జొకోవిచ్ కన్నేస్తే.. తొలి ఆస్ట్రేలియన్ ట్రోఫీ కోసం అల్కరాజ్ ఆరాటపడుతున్నాడు. తొలి నాలుగు రౌండ్ లు గెలిచిన వీరిద్దరికి క్వార్టర్‌‌‌‌ఫైనల్ లో అగ్ని పరీక్ష ఎదురు కానుంది. టెన్నిస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ మంగళవారం(జనవరి 21) మెల్‌బోర్న్‌లోని రాడ్ లావర్ ఎరీనాలో జరుగుతుంది.

ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ఏడోసీడ్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ 6–3, 6–4, 7–6 (7/4)తో జిరి లెహెకా (చెక్‌‌‌‌)పై గెలవగా, మూడోసీడ్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌ (7–5, 6–1, 0–0) మధ్యలో జాక్‌‌‌‌ డార్పర్‌‌‌‌ నడుం నొప్పితో రిటైర్‌‌ అయ్యాడు. దాంతో వాకోవర్‌‌తో ముందుకొచ్చిన అల్కరాజ్‌‌‌‌ తొలిసారి నొవాక్‌తో  క్వార్టర్స్‌‌‌‌తో పోటీకి రెడీ అయ్యాడు.  ఈ ఇద్దరిలో ఎవరు ముందుకు వెళ్తారన్న ఉత్కంఠ మొదలైంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

Also Read :- ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

నోవాక్ జొకోవిచ్ వర్సెస్ కార్లోస్ అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. సోనీ లివ్, జియో టీవీలో లైవ్ చూడొచ్చు.