Big Bash League: బిగ్ బాష్ లీగ్‌లో జొకోవిచ్ సర్ ప్రైజ్.. స్టోయినిస్ పవర్ హిట్టింగ్‌కు ఫిదా

Big Bash League: బిగ్ బాష్ లీగ్‌లో జొకోవిచ్ సర్ ప్రైజ్.. స్టోయినిస్ పవర్ హిట్టింగ్‌కు ఫిదా

సాధారణంగా టెన్నిస్ క్రికెటర్లకు క్రికెట్ తెలియదు. ఒకవేళ తెలిసినా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపించరు. కానీ నోవాక్ జొకోవిచ్ మాత్రం చాలా డిఫరెంట్. స్టార్ టెన్నిన్స్ ప్లేయర్ అయినప్పటికీ ఎంతో సింపుల్ గా క్రికెట్ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా  ఆదివారం (జనవరి 12) మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌, మెల్‌బోర్న్ స్టార్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్ లో మాజీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ జొకోవిచ్ కనిపించి సర్ ప్రైజ్ చేశాడు.

ALSO READ | Vijay Hazare Trophy: ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు: టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు

ఈ మ్యాచ్ లో జొకోవిచ్ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతుంది. ఇన్నింగ్స్ 8 వ ఓవర్ లో మూడో బంతిని టామ్ రోజర్స్‌ మార్కస్ స్టోయినిస్ కు ఓవర్ పిచ్ బాల్ వేశాడు. ఈ బంతిని స్టోయినిస్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. గాల్లోకి ఎంతో పైకి లేచిన బంతిని బౌండరీ వద్ద కేన్ రిచర్డ్సన్ కదలకుండా క్యాచ్ పట్టేశాడు. ఈ క్యాచ్ కు జొకోవిచ్ షాక్ కు గురయ్యాడు. ఆశ్చర్యంగా చూస్తూ కళ్ళు పెద్దవి చేస్తూ చూశాడు. క్యాచ్ పట్టగానే ఒక్కసారిగా కెమెరాలన్నీ జొకోవిచ్ వైపు చూపించారు. కామెంటేటర్స్ సైతం జొకోవిచ్ షాక్ అయ్యాడు అని చెప్పడం విశేషం. 

ALSO READ | Champions Trophy 2025: బవుమాకు కెప్టెన్సీ.. ఛాంపియన్స్ ట్రోఫీకి సౌతాఫ్రికా జట్టు ప్రకటన

ఈ మ్యాచ్ లో 42 పరుగులతో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ పై, మెల్‌బోర్న్ స్టార్స్‌ 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడడానికి మెల్ బోర్న్ చేరుకున్నాడు. సోమవారం అతని మ్యాచ్ ప్రారంభం కానుండగా ఒక రోజు ముందు ఆదివారం సరదాగా మ్యాచ్ చూడడానికి గ్రౌండ్ కు వచ్చాడు. కెరీర్ లో ఇప్పటివరకు 24 గ్రాండ్ స్లామ్స్ గెలిచి అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న ఆటగాళ్లలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 25 వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని ఆరాటపడుతున్నాడు. గత ఏడాది ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్.. జొకోవిచ్ తో సరదాగా టెన్నిస్ మ్యాచ్ ఆడి సందడి చేశాడు.