జొకోవిచ్‌‌‌‌‌‌‌ ఔట్‌..‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం‌ పట్టిన సెర్బియా స్టార్

జొకోవిచ్‌‌‌‌‌‌‌ ఔట్‌..‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం‌ పట్టిన సెర్బియా స్టార్

న్యూయార్క్‌‌‌‌: యూఎస్‌‌ ‌‌ఓపెన్‌లో మరో పెను సంచలనం నమోదైంది. కార్లోస్‌ ‌‌‌అల్కరాజ్‌‌‌‌ఇంటిముఖం పట్టి రోజు కూడా గడవకముందే.. కెరీర్‌లో రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌వేటలో ఉన్న నొవాక్‌‌‌‌జొకోవిచ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌సింగిల్స్‌‌‌‌‌‌‌మూడో రౌండ్‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌(సెర్బియా) 4–6, 4–6, 6–2, 4–6తో 28వ సీడ్‌‌‌‌అలెక్సీ పాపిరిన్‌‌‌‌‌(ఆస్ట్రేలియా) చేతిలో కంగుతిన్నాడు. 

దీంతో 2017 తర్వాత ఒక్క గ్రాండ్‌‌‌‌స్లామ్ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండానే నొవాక్‌‌‌‌ ఓ ఏడాదిని ముగించాడు. ఇక 2002 తర్వాత జొకోవిచ్‌‌, నడాల్‌, ఫెడరర్‌‌‌‌‌లాంటి  లెజెండ్స్‌‌‌గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌ ట్రోఫీ గెలవలేకపోయిన తొలి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇదే కావడం గమనార్హం. 18 ఏండ్ల తర్వాత యూఎస్‌‌‌‌‌‌‌‌‌ఓపెన్‌‎లో నాలుగో రౌండ్‌‌‌‌‌‌‌‌చేరకుండానే జొకో ఇంటిముఖం పట్టడం కూడా ఇదే తొలిసారి.

 పారిస్‌‌‌‌‌‌ఒలింపిక్స్‌‌‌లో గోల్డ్‌‌‌‌‌ నెగ్గిన జొకో నాలుగు వారాల వ్యవధిలోనే యూఎస్‌‌‌‌‌‌‌‌‌ఓపెన్‌‌‌‌‌‌ఆడటంతో అలసిపోయినట్లు కనిపించాడు. ఫలితంగా కోర్టులో చురుగ్గా కదల్లేకపోయాడు. 3 గంటలా 19 నిమిషాల మ్యాచ్‌లో మూడో సెట్‌లో మాత్రమే తన ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌షాట్లతో అలరించాడు. కానీ అప్పటికే రెండు సెట్లు నెగ్గి జోరుమీదున్న పాపిరిన్‌‌‌‌ సెర్బియన్‌కు ఎలాంటి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌ఇవ్వలేదు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొత్తంలో 16 ఏస్‌‌‌లు కొట్టిన జొకో 14 డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాల్ట్స్‌చేశాడు. 16 బ్రేక్‌‌‌‌ పాయింట్లలో నాలుగే కాపాడుకున్నాడు. బలమైన సర్వీస్‌‌‌‌లతో చెలరేగిన పాపిరిన్‌‌‌‌‌‌‌‌‌నెట్ గేమ్‌లోనూ ఆకట్టుకున్నాడు. 

ఇతర మ్యాచ్‌‌ల్లో జ్వెరెవ్‌‌‌‌‌‌(జర్మనీ) 5–7, 7–5, 6–1, 6–3తో థామస్‌‌‌‌‌మార్టిన్‌‌‌‌‌‌‌‌‌‌ఎట్చెవరి (అర్జెంటీనా)పై, ఫ్రిట్జ్‌‌ (అమెరికా) 6–3, 6–4, 6–2తో కొమెసెనా (అర్జెంటీనా)పై, రబ్లెవ్‌‌‌‌‌‌‌‌‌‌(రష్యా) 6–3, 7–5, 6–4తో లెహెకా (చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై, రుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌(నార్వే) 6–7 (1/7), 3–6, 6–0, 6–3, 6–1తో షాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (చైనా)పై గెలిచారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌లో  కోకా గాఫ్‌‌‌‌‌(అమెరికా) 3–6, 6–3, 6–3తో స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై, సబలెంక(బెలారస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 2–6, 6–1, 6–2తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై, నవారో (అమెరికా) 6–4. 4–6, 6–3తో కోత్సుక్‌‌‌‌‌‌‌‌‌(ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై, కీస్‌‌‌‌‌ (అమెరికా) 7–6 (7/5), 5–7, 4–6తో మార్టినెస్‌‌‌‌‌‌‌‌‌(బెల్జియం)పై, జెంగ్‌‌‌‌‌‌‌‌(చైనా) 6–2, 6–1తో నెమియర్‌‌‌‌‌‌‌(జర్మనీ)పై నెగ్గారు.

ప్రిక్వార్టర్స్‌‌లో బోపన్న జోడీ

 మెన్స్‌ డబుల్స్‌‌‌ రెండో రౌండ్లో ఇండియా స్టార్‌‌‌ రోహన్‌‌‌‌‌బోపన్న–మాథ్యూ ఎబ్డెన్‌‌‌(ఆస్ట్రేలియా) 6–2, 6–4తో బెనా (స్పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)–కొరియా (అర్జెంటీనా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌ చేరగా, శ్రీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌బాలాజీ–అండ్రేజీ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6–7 (4/7), 4–6తో స్కుప్‌‌‌‌స్కి (బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)–వీనస్‌‌‌(అమెరికా) చేతిలో ఓడారు