కరోనా వైరస్ ముప్పు: ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

చైనాలో పుట్టి.. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కొత్త వైరస్ కరోనా ముప్పు పొరుగు దేశం భారత్‌కు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ అటాక్ అయితే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, వాంతులు లాంటివి తీవ్రంగా ఉంటాయి. సింప్టమ్స్ బాగా ఎక్కువై.. ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదం ఉంది. అయితే, ఈ లక్షణాలకు చికిత్స చేయడం తప్ప.. ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఇప్పటికే చైనాలో దీని వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని చైనా శాస్త్రవేత్తలు తేల్చిన నేపథ్యంలో భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల స్క్రీనింగ్ మొదలు పెట్టారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను బయటకు అనుమతిస్తున్నారు. అయితే చైనా నుంచి విదేశాలకు ఈ కొత్త వైరస్ వ్యాపిస్తోంది. జపాన్, థాయ్‌లాండ్ సహా అమెరికాలోనూ దీని బారిన పడినవారిని గుర్తించారు. ఈ నేపథ్యంలో చైనాతో పాటు ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

డోంట్ టచ్: చైనాలోని వుహాన్ సిటీలో మొదలైన ఈ కొత్త వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. జలుబు, గొంతు గరగర, జ్వరం, తలనొప్పి, ఊపిరి అందకపోవడం వాంతులు దీని లక్షణాలు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉన్నందున ప్రయాణం చేసేటప్పుడు పక్కన ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపించినా వారిని కనీసం టచ్ కూడా చేయొద్దు.

మాస్క్: తమ్ములు, గాలిలో కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున మంచి క్వాలిటీ మాస్క్‌లు వాడడం మంచిది.

చేతుల శుభ్రత: చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ముఖ్యం విదేశీ ప్రయాణంలో ఉన్నవాళ్లు తరచూ చేతులను సబ్బుతో (కనీసం 20 సెకన్లపాటు చేతులను రుద్ది) కడుక్కోవడం మేలని తెలిపింది.

జంతువులను టచ్ చేయొద్దు: కరోనా వైరస్ జంతువుల నుంచే మనుషులకు వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో, చైనా, ఇతర దేశాలకు వెళ్లే వాళ్లు పెట్స్ సహా ఎటువంటి జంతువులనూ తాకకపోవడం మంచింది.

నాన్ వెజ్: విదేశాలకు వెళ్లినప్పుడు మాంసాహారం తినే వాళ్లు కొన్నాళ్లపాటు దానికి దూరంగా ఉండడం మేలు. తప్పనిసరి అయితే బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి.

More News:

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

సింహాల దయనీయ స్థితి.. కంటతడి పెట్టిస్టున్న ఫొటోలు వైరల్

దగ్గరుండి కటింగ్ చేయించిన తల్లి.. ఉరేసుకున్న కొడుకు

అందమైన అమ్మాయితో ప్రేమ పెళ్లి.. అంతలోనే అనుమానంతో హత్య