సప్త హారతి కాంతుల్లో మహాదేవుడు

 కార్తీక మాసం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న  కోటి దీపోత్సవం మంగళవారం భక్తులతో  కిటకిటలాడింది.  కంచి కామాక్షి, శృంగేరి శారదాంబికాకు కోటి పసుపు కొమ్ముల సుమంగళి పూజను ఘనంగా నిర్వహించారు.  అలంపూర్​ జోగులాంబ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు సప్త హారతి కాంతులతో మహాదేవుడిని కొలిచారు.