తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్ లైన్ లో ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది.
కనీస సమాచారం ఇవ్వకుండా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిన్నరాత్రి(సెప్టెంబర్ 07) నోటిఫికేషన్ ఇచ్చారు. టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తొలిసారిగా ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు.. ఏర్పాటు చేయనున్నారు. ఇక అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు కాగా... ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు సడలింపు ఇచ్చారు.
నోటిఫికేషన్ కు సబంధించిన ఇతర వివరాలన్నీ సెప్టెంబర్ 15 నుంచి www.schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.