న్యూఢిల్లీ: అన్ని ప్రొడక్ట్‌ల ధరల పెరుగుదలను కొలిచే రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఈ ఏడాది నవంబర్‌లో 5.48 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలలో 14 నెలల గరిష్టమైన 6.21 శాతాన్ని టచ్ చేసింది. కిందటి నెలలో పట్టణాలతో (4.83 శాతం) పోలిస్తే గ్రామాల్లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (5.95 శాతం) ఎక్కువగా ఉంది. ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ని 2–6 శాతం లోపు ఉంచాలని ఆర్‌బీఐ టార్గెట్‌గాsతతతతత పెట్టుకుంది.
లాంగ్‌టెర్మ్‌లో 4 శాతం దిగువకు తీసుకురావాలని చూస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో ఆహార పదార్ధాల ధరలు ఎక్కువగా పెరిగాయి. అక్టోబర్‌తో పోలిస్తే కొంత తగ్గినా, ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ కిందటి నెలలో 9.04 శాతం వద్ద గరిష్టాల్లో కొనసాగుతోంది. ఇండ్ల ధరల పెరుగుదలను కొలిచే హౌసింగ్ ఇన్‌ఫ్లేషన్ అక్టోబర్‌లో 2.81 శాతం ఉంటే నవంబర్‌లో 2.87 శాతానికి పెరిగింది.
ప్రొడక్షన్ 3.5 శాతం అప్..
ఇండియాలోని ఇండస్ట్రీల ప్రొడక్షన్ ఏడాది ప్రాతిపదికన ఈ ఏడాది అక్టోబర్‌లో 3.5 శాతం పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 3.1 శాతం గ్రోత్ నమోదు చేసింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ ప్రొడక్షన్ 4.1 శాతం, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి 2 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏడాది ప్రాతిపదికన 4 శాతం వృద్ధి నమోదు చేసింది.