ఇక యాక్టింగ్పై ఫోకస్.. కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ నుంచి క్రేజీ ఛాన్స్‌‌‌‌‌‌‌‌ కొట్టేసిన శోభిత

ఇక యాక్టింగ్పై ఫోకస్.. కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ నుంచి క్రేజీ ఛాన్స్‌‌‌‌‌‌‌‌ కొట్టేసిన శోభిత

నాగచైతన్యను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత ధూళిపాళ తిరిగి తన యాక్టింగ్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలో ఓ తమిళ చిత్రంలో ఆమె నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మద్రాస్, కబాలి, సార్పట్టపరంపరై, తంగలాన్ లాంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరుగాంచిన పా.రంజిత్.. ‘వెట్టువమ్‌‌‌‌‌‌‌‌’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో ఓ సినిమా చేయబోతున్నాడు.  

ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా శోభితను  సంప్రదిస్తున్నట్టు సమాచారం.  ‘తంగలాన్‌‌‌‌‌‌‌‌’కు ముందే ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేసినప్పటికీ రకరకాల కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. పా.రంజిత్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్ మూవీ ‘అట్టకత్తి’లో నటించిన దినేష్‌‌‌‌‌‌‌‌ ఇందులో హీరోగా నటించనుండగా ఆర్య విలన్‌‌‌‌‌‌‌‌గా నటించబోతున్నాడు. మధురై బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో రూపొందబోయే ఈ ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌ డ్రామాలో ఫహద్ ఫాజిల్, అశోక్ సెల్వన్ కీలకపాత్రలు పోషించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.  

గోల్డెన్ రెయోమ్స్‌‌‌‌‌‌‌‌ సంస్థతో కలిసి పా.రంజిత్‌‌‌‌‌‌‌‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ నిర్మించనుంది. ఇక పా.రంజిత్ సినిమాలో పాత్రలు  రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌కు భిన్నంగా రా అండ్‌‌‌‌‌‌‌‌ రస్టిక్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. శోభిత కూడా అలాంటి ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ‘పొన్నియిన్‌‌‌‌‌‌‌‌ సెల్వన్‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ ఇచ్చిన ఆమెకు తమిళంలో ఇది నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్ కానుంది.