ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్రెండ్ నడుస్తోంది. ఏఐ సేవల్ని మరింతగా వాడుకునేందుకు గూగుల్ ‘ఏఐ అసిస్టెంట్’ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు గూగుల్ బార్డ్ చాట్‌బాట్‌ను ‘జెమిని’గా రీ బ్రాండ్ చేసింది. ఆండ్రాయిడ్ కస్టమర్స్ కోసం జెమిని యాప్ తెచ్చింది. జెమిని యాప్ యూజర్లు ఏఐ అసిస్టెంట్‌తో చాట్ చేయొచ్చు. దాంతోపాటు గూగుల్ఫోన్ యూజర్లకు డిఫాల్ట్ ఏఐ అసిస్టెంట్‌గా మార్చేసుకోవచ్చు.
- జెమిని యాప్ ఓపెన్ చేసి యూజర్లు ‘ఓకే గూగుల్’ అని చెప్పాలి లేదా హోమ్ బటన్ ఎక్కువసేపు నొక్కిపట్టాలి.
- గూగుల్ ప్లే స్టోర్ నుంచి జెమిని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఐఒఎస్16 అంతకంటే పైనున్న వాటిలో అయితే గూగుల్ యాప్‌లో జెమిని ట్యాబ్ ఉంటుంది.
- యాప్ ఓపెన్ చేసి, ‘గెట్ స్టార్టెడ్’ మీద ట్యాప్ చేయాలి.
- జెమిని ఎలా సాయపడుతుందో చదివాక, ‘మోర్’ ఆప్షన్ని ట్యాప్ చేయాలి.
- ఆపై స్క్రీన్‌లో ‘ఐ అగ్రీ’ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే జెమిని యాప్ ఎనేబుల్ అవుతుంది.
ఎలా పనిచేస్తుందంటే..
కంటెంట్‌ని క్రియేట్ చేయడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం లేదా ఫోన్ వాడకాన్ని తగ్గించడం వంటి రకరకాల టాస్క్‌ల్లో జెమిని హెల్ప్ చేస్తుంది. జెమినిని హెల్ప్ అడగడానికి వాయిస్, టెక్స్ట్, ఫొటో ఇన్పుట్ వంటివి ఇవ్వాలి. తర్వాత మెయిల్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. యాప్ మధ్యలో ఉన్న చాట్స్ విభాగంలో ప్రశ్నలకు రెస్పాన్స్ చూడొచ్చు.
జెమిని యాప్‌లో కుడివైపు పైన ఉన్న ప్రొఫైల్ ఐకాన్ ట్యాప్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్‌కు వెళ్లాలి. గూగుల్ నుంచి ‘డిజిటల్ అసిస్టెంట్స్’పై ట్యాప్ చేయాలి. డిఫాల్ట్ డిజిటల్ అసిస్టెంట్‌గా సెట్ చేసేందుకు జెమినిపై నొక్కాలి. అయితే ప్రస్తుతం ఏఐ అసిస్టెంట్ జెమిని.. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, కెనడా అంతటా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.