హుజూరాబాద్ లో ఇంటింటికి లోన్లు అంటూ ప్రలోభాలు

టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఎంత మందిని కొనుగోలు చేసినా, వందల కోట్లు ఖర్చు చేసినా ఇక్కడ ఎగిరేది కషాయపు జెండా మాత్రమే అన్నారు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్.  రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క హుజురాబాద్ నియోజక వర్గంలోనే కోట్ల రూపాయాలు ఇస్తామని, కుల సంఘం భవనాలు ఇస్తామంటూ మభ్య పెట్టడం సరికాదన్నారు.  టీఆర్ఎస్ నేత‌లు ఇంటింటికి లోన్లు ఇస్తాం, మహిళ సంఘాలకు సహాయం చేస్తాం అంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు.  ఇన్ని ప్రలోభాలకు గురి చేసినా కేసీఆర్.. ఈటల రాజేందర్ ను మోసం చేసారనే విషయం ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.  ఇంటలిజెన్స్, మఫ్టీలో ఉన్న పోలీసులు ఇంటింటికి వెళ్తూ రాజకీయ కార్యకర్తల్లా పని చేస్తున్నారని తెలిపారు.  యావత్తు తెలంగాణ ప్రజలు హుజురాబాద్ వైపు చూస్తున్నారని.. హుజురాబాద్ ప్రజలు గురుతరమైన బాధ్యత భుజాల మీద వేసుకొన్నారన్నారు. ధర్మం, న్యాయం కాపాడటంలో, ఆహాంకారాన్ని ఓడించడంలో, ఆత్మ గౌరవం గెలిపించడంలో, పువ్వు గుర్తు గెలిపించడంలో ప్రజలు క్రియ శీలకంగా వ్యవహరించాలన్నారు.