- ఎల్లారెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్మదన్కు బాసటగా నిలుస్తున్న ఏనుగు అనుచరులు
- బాన్సువాడలో ఏనుగు విజయానికి కృషి చేస్తామంటున్న మదన్మోహన్, ఆయన వర్గం
- రెండు నియోజకవర్గాల్లో తమ క్యాడర్‌ను యాక్టివ్ చేసిన నేతలు
కామారెడ్డి, వెలుగు: మొన్నటి వరకు ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే పార్టీ నుంచి చెరో చోట పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఒకరికి టికెట్కన్ఫామ్కాగా, మరో నేతకు అఫిషీయల్‌గా ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు ‘చేతులు’ కలిపి పరస్పరం సహకరించుకునేందుకు సిద్ధమయ్యారు. వారే ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు తమ క్యాడర్‌ను రెండు నియోజకవర్గాల్లో యాక్టివ్ చేశారు.
గతంలో జహీరాబాద్ ఎంపీగా రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన మదన్‌మోహన్‌రావుకు ఆయా నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉంది. 2019 పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీపాటిల్‌కు గట్టి పోటీ ఇచ్చి, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్లకు ఎల్లారెడ్డి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్టీ ప్రోగ్రామ్స్‌తో పాటు, వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎల్లారెడ్డికి పక్కనే ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోనూ మదన్‌కు క్యాడర్ఉంది.
ఎల్లారెడ్డి కాంగ్రెస్టికెట్కోసం మదన్మోహన్రావు, సుభాష్‌రెడ్డి పోటీపడగా అధిష్టానం మదన్‌కు టికెట్‌ఇచ్చింది. ఏనుగు రవీందర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎల్లారెడ్డిలో పోటీ వరుస విజయాలు సాధించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజాల సురేందర్చేతిలో ఓడిపోయారు. కొన్నాళ్లకు సురేందర్కాంగ్రెస్లో చేరాడు. ఎమ్మెల్యే సురేందర్‌తో పొసగక కొన్నాళ్లకు ఏనుగు బీజేపీలో చేరారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో రవీందర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నారు. ఎల్లారెడ్డిలో అప్పటికే ఇద్దరు నేతలు టికెట్రేసులో ఉన్న దృష్ట్యా ఈయన్ను పక్క నియోజకవర్గం బాన్సువాడలో పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నేతల మధ్య అవగాహన..
ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి క్యాడర్ఉంది. ఈయన కాంగ్రెస్‌లో చేరిన దృష్ట్యా వారు కూడా ఈ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. బాన్సువాడలో మదన్‌మోహన్‌రావుకు క్యాడర్ఉంది. బాన్సువాడ నుంచి పోటీకి ఏనుగు రవీందర్‌రెడ్డి రెడీ అయ్యారు. అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మదన్మోహన్రావు, ఏనుగు రవీందర్రెడ్డిల మధ్య అవగాహన కుదిరింది.
ALSO READ : నన్ను కొనే శక్తి ఎవరికీ లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఏనుగు రవీందర్‌రెడ్డి క్యాడర్ఎల్లారెడ్డిలో మదన్ మోహన్‌రావుకు పని చేయనుండగా, మదన్మోహన్క్యాడర్బాన్సువాడలో రవీందర్‌రెడ్డికి పనిచేసేలా అవగాహన కుదిరినట్లు పార్టీ లీడర్లు చెబుతున్నారు. సదాశివ్‌నగర్, ఎల్లారెడ్డిల్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లోనూ ఏనుగు రవీందర్‌రెడ్డితో పాటు, ఆయన క్యాడర్హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రెండు చోట్ల తమ క్యాడర్ని యాక్టివ్చేసి పరస్పర విజయం కోసం సహకరించుకుంటున్నారు.