గుడ్ న్యూస్..ఉచిత విద్యుత్ పథకాన్ని పోస్టాఫీసు ద్వారా పొందొచ్చు

కోటి కుటుంబాలకు ఉచిత సౌరవిద్యుత్ అందించే పథకాన్ని ఇటీవల ప్రధాని మోదీ సూర్య ఘర్ ఫ్రీ బిజిలీ యోజన పేరుతో ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను పొందవచ్చు. అయితే ఈ ఉచిత విద్యుత్ పథకానికి ఎలా అప్లయ్ చేసుకోవాలని చాలామంది కి డౌట్ ఉంది. అయితే ఈ పధకానికి అప్లయ్ చేసుకునేందుకు ఎక్కడికి వెళ్లా్ల్సిన పని లేదు.. మీ ఇంటికి సమీపంలో ఉన్న పోస్టాపీసు నుంచి ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ సదుపాయాన్ని ప్రస్తుతం కర్ణాటకలో ప్రారంభించారు. కర్ణాటక పోస్ట్ సర్కిల్ లోని పోస్టల్ ఉద్యోగులు ఇప్పటికే ప్రధాన మంత్రి సూర్య ఘర్ ఫ్రీ బిజిలీ యోజన కింద రిజిస్త్రేషన్లు ప్రారంభించారు.అయితే ఈ పథకం కోసం గత ఆరు నెలల విద్యుత్ బిల్లులు చెల్లించి ఉండాలి.. అప్పుడే సబ్సిడీ ప్రయోజనం పొందుతారు. 

ALSO READ :- ముసలోడే కానీ మహానుభావుడు.. 92 ఏళ్ల వయస్సులో బిలియనీర్‌ ఐదో పెళ్లి

దేశంలోని కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింది ప్రతి ఇంటికి ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తారు. ఈ పథకం కింద వినియోగదారులకు మూడు కిలో వాట్ ల వరకు కిలోవాట్ కు రూ. 30వేలు, మూడు కిలోవాట్ ల కంటే ఎక్కువ కనెక్షన్లకు కిలో వాట్ కు రూ. 18వేల చొప్పున సబ్సిడీ ఇస్తారు. ఈ సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలకు చేరుతుంది.