గోల్కొండ కోటలో నో యువర్ ఆర్మీ మేళా

 గోల్కొండ కోటలో నో యువర్ ఆర్మీ మేళా
  • ముఖ్య అతిథిగా ప్రారంభించిన గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్ సిటీ/ఓయూ/గచ్చిబౌలి, వెలుగు: ఇండియన్​ఆర్మీ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన ‘నో యువర్ ఆర్మీ మేళా–2025’ని మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, గాక్ టాసా, సీనియర్ అధికారులతో కలిసి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం ప్రారంభించారు. ముందుగా ఆర్మీ ఆఫీసర్లు గవర్నర్​కు సైనిక స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపన అనంతరం మేళాను ప్రారంభించారు. మేళాలో ఆర్టిలరీ గన్‌లు, కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, ఎన్‌బీసీ(న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్) వార్‌ఫేర్ సూట్‌లు, స్వదేశీ సైనిక ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచారు. పంజాబ్ రెజిమెంట్ సైనికులు ఉత్కంఠభరితమైన గట్కా ప్రదర్శనతో కట్టిపడేశారు. సింఫనీ, పైప్ బ్యాండ్ ఉత్తేజకరమైన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

శని, ఆదివారాలు మేళా కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఓయూలోని ఆంగ్లభాషా బోధనా కేంద్రం(ఈఎల్​టీసీ) ఆధ్వర్యంలో 33 జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున గిరిజన అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లను ఎంపిక చేసి శుక్రవారం ఆర్ట్స్​కాలేజీలో స్పోకెన్​ఇంగ్లిష్​పై నెల రోజుల శిక్షణ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గవర్నర్​పాల్గొని మాట్లాడారు.

 వీసీ ప్రొఫెసర్​కుమార్, ఈఎల్టీసీ డైరెక్టర్ ప్రొఫెసర్​విజయ చొరవను గవర్నర్ అభినందించారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ)లో నిర్వహించిన స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 144 మందికి సర్టిఫికెట్లు, ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లకు గోల్డ్​మెడల్స్​అందజేశారు. కాలేజీ డైరెక్టర్​డాక్టర్ జి.రామేశ్వరరావు, స్కూల్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్స్ స్టడీస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్మోహన్‌రెడ్డి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.