
మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎన్పీసీఐఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 4వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు 4: మెడికల్ ఆఫీసర్–సి(జీడీఎంఓ).
అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిప్లొమా(డీఆర్ఎం)లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 2025, మార్చి 4 నాటికి 35 ఏండ్లు నిండి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు
యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు 2: యంగ్ ప్రొఫెషనల్స్–2.
ఎలిజిబిలిటీ: సోషల్ వర్క్, స్టాటిస్టిక్స్, సోషియాలజీ, లైఫ్ సెన్సెస్‌లో 55 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో ఉతీర్ణతతోపాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి 40 ఏండ్లు మించకూడదు.