భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసి గేట్-2022/ గేట్-2023/ గేట్-2024 స్కోర్ కలిగి ఉన్నవారు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు NPCIL అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 400
విభాగాల వారీగా ఖాళీలు
- మెకానికల్: 150
- కెమికల్: 73
- ఎలక్ట్రికల్: 69
- ఎలక్ట్రానిక్స్: 29
- ఇన్ స్ట్రుమెంటేషన్: 19
- సివిల్: 60
విద్యార్హతలు: అభ్యర్థులు బీఈ/బీటెక్ /బీఎస్సీ (ఇంజినీరింగ్ ) లేదా 5 సంవత్సరాల ఎంటెక్ లో కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్, కెమికల్, సివిల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, గేట్-2022/ గేట్-2023/ గేట్-2024 స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: జనరల్/ EWS అభ్యర్థులకు 26 ఏళ్లు, ఓబీసీలకు 29 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలుకు 31 ఏళ్లు, PwBD జనరల్/ EWS అభ్యర్థులకు 36 ఏళ్లు, PwBD ఓబీసీలకు 39 ఏళ్లు, PwBD ఎస్సీ/ ఎస్టీలకు 41 ఏళ్లు వయో పరిమితి కలదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ EWS/ ఓబీసీ పురుష అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, లకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: మొదట గేట్ 2022, గేట్ 2023, గేట్ 2024 స్కోర్ల ఆధారంగా 1:12 రేషియోలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మెడికల్ ఫిట్ నెస్ కు లోబడి పర్సనల్ ఇంటర్వ్యూలో రాణించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.55,000 స్టైపెండ్ చెల్లిస్తారు. అలాగే, వన్ టైమ్ బుక్ అలవెన్స్ కింద రూ.18,000 చెల్లిస్తారు.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 10-04-2024
దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2024