
- భారీ వర్షాలు, ఈదురు గాలులపై వాతావరణ శాఖ హెచ్చరిక
- ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను మానిటర్ చేయాలి
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశం
హనుమకొండ, వెలుగు: భారీ వర్షాలు, ఈదురు గాలులపై వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలైన భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను మానిటర్ చేయాలని సూచించారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్నుంచి సంస్థ పరిధిలోని ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ద్వారా మాట్లాడారు. వర్షాలతో ఎక్కడైనా చెట్లు విరిగి, లైన్లు తెగిపడి ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్ జరిగితే వెంటనే సరఫరా పునరుద్ధరించేలా ఆఫీసర్లు తగు చర్యలు చేపట్టాలన్నారు.
పంటల కోతలు పూర్తవుతున్న నేపథ్యంలో పెండింగ్ వ్యవసాయ సర్వీసులన్నీ రిలీజ్ చేయాలని ఆదేశించారు. వ్యవసాయానికి అవసరమైన చోట 63కేవీ ఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి సర్కిల్ పరిధిలో ఎల్సీ యాప్ పై కిందిస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ యాప్ ద్వారా మానవ తప్పిదాలను పూర్తిగా నివారించవచ్చన్నారు. కాన్ఫరెన్స్ లో ఇన్చార్జ్ డైరెక్టర్ టి.సదర్ లాల్, వివిధ సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఆఫీసర్లు పాల్గొన్నారు.