ఫీడర్, పంప్ హౌస్ పనులు త్వరగా పూర్తి చేయాలి

 ఫీడర్, పంప్ హౌస్ పనులు త్వరగా పూర్తి చేయాలి
  • టీజీఎన్​పీడీసీఎల్​ సీఎండీ కె.వరుణ్​రెడ్డి

గోదావరిఖని, వెలుగు:  అంతర్గాం మండల పరిధిలో చేపట్టిన ఫీడర్​, పంప్​హౌస్​ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ఎన్​పీడీసీఎల్​ సీఎండీ కె.వరుణ్​రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం అంతర్గాం మండలంలోని మూర్మూర్​ వద్ద రామగుండం ఎరువుల కర్మాగారం కోసం నీటిని తరలించేందుకు రూ.1.80 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఫీడర్​ నిర్మాణ పనులను, అంతర్గాం మండలానికి  సాగునీటిని అందించేందుకు చేపడుతున్న పంప్​హౌస్​ పనులను ఆయన పరిశీలించారు.

అంతర్గాం మండలం ఆకెనపల్లి సబ్​ స్టేషన్​ను సీఎండీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  విద్యుత్​సరఫరా, ఇతర సమస్యలపై ఆయన ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు.  సీఎండీ వెంట ఎస్​ఈ సుదర్శన్, డీఈలు ఈశ్వరప్రసాద్​, తిరుపతి, బాలయ్య, ఏడీఈ రాజ్​కుమార్​, విజయ్​ గోపాల్​, అంతర్గాం ఏఈ శంకర్​, తదితరులున్నారు.