కామారెడ్డి, వెలుగు: కరెంటు సమస్యలు పరిష్కరించేందుకు, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతం చేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్కామారెడ్డి ఎస్ఈ ఎం.రమేశ్‌బాబు బుధవారం తెలిపారు. కరెంటు సమస్యలపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 కు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.
ఈ టోల్‌ఫ్రీ నంబర్24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ట్రాన్స్ఫార్మర్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్, కాలిపోయిన, కరంటు సప్లయ్‌లో సమస్యలు, ప్యూజ్ ఆఫ్ కాల్, కరంటు మీటర్ల మార్పు, క్యాటగిరి మార్పు, బిల్లులో ఏమైనా సమస్యలు, కొత్త సర్వీసు కనెక్షన్ల శాంక్షన్ వంటి అంశాలపై టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత ఆఫీసర్‌కు సమాచారం వెళ్లటంతో పాటు, వినియోగదారునికి మెసేజ్ కూడా వస్తుందన్నారు. టోల్‌ఫ్రీ ఫిర్యాదులపై ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారని చెప్పారు.