విద్యుత్ సేవల విస్తరణకు ప్రత్యేక యాప్..

విద్యుత్ సేవల విస్తరణకు ప్రత్యేక యాప్..
  • 20 ఫీచర్లు.. టోల్ ఫ్రీ నంబర్ 
  • వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన ఎన్పీడీసీఎల్

నిర్మల్, వెలుగు :  వేసవిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నాణ్యమైన విద్యుత్  సరఫరా చేసేందుకు  ఎన్పీడీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 20 ఫీచర్లతో కూడిన ప్రత్యేక యాప్ ను రూపొందించి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే నిర్మల్ సర్కిల్ సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ సుదర్శనం ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ల వారీగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.

.ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టే షన్ల  మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు స్పెషల్ మొబైల్ వెహికల్ ని కూడా అందజేశారు. యాప్ లో రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఎక్క డైనా విద్యుత్ సరఫరా లో సమస్య ఏర్పడగానే యాప్ ద్వారా వినియోగదారులు రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ ఫీచర్ ఓపెన్ చేసి ఫొటో లేదా వీడియోతో జీపీఎస్ లొకేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

అందిన వెంటనే అక్కడికి సంబంధిత ఆఫీసర్ వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. అలాగే కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్,  సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్ లైన్ పేమెంట్ హిస్టరీ, న్యూ సర్వీస్ పొజిషన్, లింక్ ఆధార్ అండ్ మొబైల్, డొమెస్టిక్ బిల్ క్యాలిక్యులేటర్, న్యూ కనెక్షన్ అవేర్ నెస్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్ బ్యాక్, మై అకౌంట్, బిల్ ఇన్ఫర్మేషన్ వంటి పలు  కొత్త ఫీచర్లు పొందుపరిచారు. ఇప్పటికే విద్యుత్ వినియోగదారులకు 1912 లేదా 18004 250 028 పేరిట టోల్ ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులో ఉంచారు.