దివ్యాంగులను కించపర్చేలా నేతల కామెంట్లు..చంద్రబాబు, సీపీ జోషీలపై ఈసీకి NPRD ఫిర్యాదు

 న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో దివ్యాంగులను కించపర్చేలా పలువురు నేతలు కామెంట్లు చేస్తున్నారని ఈసీకి నేషనల్ ప్లాట్ ఫామ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిజేబుల్డ్ (ఎన్ పీఆర్ డీ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్ పీఆర్ డీ జనరల్ సెక్రటరీ మురళీధరన్ ఈసీకి లేఖ రాశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత సీపీ జోషీతోపాటు కొందరు నేతలు దివ్యాంగులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని తెలిపారు.  అలాంటి వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యర్థి మానసిక ఆరోగ్యం గురించి చంద్రబాబు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. మరికొందరు నేతలూ దివ్యాంగులను అవమానించేలా మాట్లాడారని పేర్కొన్నారు.