
మహిళను బ్లాక్ మెయిల్ చేసి వేధించినందుకు ఓ ఎన్ఆర్ఐపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. దుబాయ్ కు చెందిన నౌషాద్ అబూబకర్(38) అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ దుబాయ్ పబ్‌లో డ్యాన్సర్ గా పనిచేసింది. అదే సమయంలో అక్కడ నౌషాద్ అబూబకర్ తో స్నేహం ఏర్పడింది. రెండేళ్ల తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. అయితే తనతో చనువుగా ఉన్న ఫోటోలు ,వీడియోలు తన భర్తకు పంపిస్తానని బెదిరిస్తూ ఫోన్ లో బ్లాక్ మెయిల్ చేసేవాడు నౌషద్ . ఈ వేధింపులను ఎలాగైన ఆపాలని ఆ మహిళ మళ్లీ దుబాయ్ వెళ్లింది. తన ఫోటోలు, వీడియోలు తొలగించాలని వేడుకుంది. దీనికి నౌషద్ అంగీకరించడంతో మహిళ హైదరాబాద్ కు తిరిగి వచ్చింది.
ALSO READ | హైదరాబాద్ లో పెళ్లిళ్లు,పేరంటాలకు ఇలాంటి మటనా.? ఇది తిన్నోళ్లు బతుకుతారా.?
అయితే ఇటీవల హైదరాబాద్ వచ్చిన నిందితుడు నౌషద్ తన భర్త ,పిల్లలను విడిచిపెట్టి తనను వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆ మహిళ నిరాకరించడంతో ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు . దీంతో బాధితురాలు మార్చి 20 గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.