గాంధీ దవాఖానకు అడ్వాన్స్​డ్ ఎక్విప్​మెంట్.. ఎన్ఆర్ఐ ఔదార్యం

గాంధీ దవాఖానకు అడ్వాన్స్​డ్ ఎక్విప్​మెంట్.. ఎన్ఆర్ఐ ఔదార్యం
  • టీడీఎఫ్​ సేవ ప్రాజెక్ట్​ కింద అధునాతన వైద్య పరికరాలు అందజేత

పద్మారావునగర్, వెలుగు: అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ దివేశ్ ఆర్ అనిరెడ్డి ఔదార్యం చాటుకున్నారు. తెలంగాణ డెవలప్​మెంట్ ఫోరం ఆరోగ్య సేవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ దవాఖానలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్​మెంట్​కు ఆధునాతన వైద్య పరికరాలను అందజేశారు. రూ.27 లక్షలతో ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన ‘ఏసోఫెగల్ అండ్ అనల్ మనోమెట్రీ మిషన్’​ను గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఇందిర, హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజకుమారి, గ్యాస్ర్టోఎంట్రాలజీ డిపార్డుమెంట్ హెచ్ఓడీ  డా.శ్రవణ్ కుమార్ కలిసి గురువారం ప్రారంభించారు. 

ఈ మెడికల్ ఎక్విప్ మెంట్​తో పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ-1  డా. శేషాద్రి, కిమ్స్​వైద్య నిపుణులు డాక్టర్​నితీశ్ ప్రతాప్, టీడీఎఫ్​ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి, యూఎస్​ఏ బోర్డు మెంబర్​ డోకూరు సదానంద్, ప్రగతి వెల్ఫేర్​ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.