గుర్తు లేకుండా పోటీకి పర్మిషనివ్వండి.. సీఈసీ అనుమతి కోరిన ఎన్నారై జలగం సుధీర్

సూర్యాపేట: 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎలక్షన్లలో గుర్తులపై ఆధారపడి పోటీ చేయటం బాధాకరమని ఎన్నారై జలగం సుధీర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింబల్ లేకుండా కోదాడ నుంచి పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరారు. 

ఈ మేరకు ఆయన ఎలక్షన్​కమిషన్​ కు మెయిల్ ద్వారా వినతిపత్రం అందించారు. ‘1968లో వచ్చిన గుర్తుల విధానం.. ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారం తీసివేయాల్సిన అవసరం ఉంది. ప్రధాన పార్టీలకు సింబల్స్ ప్రచారం చేసుకోవటానికి ఎక్కువ టైం ఉంది. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల ప్రచారానికి తగిన సమయం దొరకపోవటం కూడా ప్రజల్లో చర్చ ఉన్నది. 

నవంబర్ 30న కోదాడ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రమంలో ఎటువంటి గుర్తు కేటాయించకుండా కేవలం  పేరు, ఫొటోతో మాత్రమే ఎలక్షన్ ప్రక్రియలో ఉండటానికి తనకు ప్రత్యేక  అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.