ఓటు వేయడానికి ఆమెరికా నుంచి వచ్చిండు

ప్రజలు సొంతూరుకి వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం పోలింగ్ రోజును సెలవు దినంగా ప్రకటించింది. అయినప్పటికీ చాలామంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. కానీ  అమెరికాలోని టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తోన్న ఎన్ఆర్ఐ ప్రసన్న కుమార్ మాత్రం ఓటు వేసేందుకు ఆమెరికా నుంచి ఏపీలోని పిఠాపురానికి వచ్చాడు.  ఓటు వేసేందుకు ఆయన రూ. 1.6 లక్షలు ఖర్చు చేసి పిఠాపురం చేరుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు ఎన్ఆర్ఐలు  విదేశాల నుంచి వచ్చారు.  

దేశాలు దాటినా సరే వచ్చి ఓటు వేయడం మన బాధ్యత అని ప్రసన్న కుమార్ అంటున్నాడు.   ఐదేళ్లకు ఓసారి వచ్చే ఓట్ల పండుగలో ఓటుహక్కు వినియోగించుకుని ప్రజాస్వా్మ్య స్ఫూర్తిని చాటాలని చెబుతున్నాడు. ఓటువేసేందుకు ఆమెరికా నుంచి లక్షలు ఖర్చుచేసుకుని వచ్చిన  ప్రసన్న కుమార్ ను  స్థానికులు ప్రశంసిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా   పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వంగగీత విశ్వనాథ్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.