
కొత్తపల్లి, వెలుగు : కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ఇ టెక్నో స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న టి.వరుణ్యకు నృత్య జ్ఞాన జ్యోతి అవార్డు లభించినట్లు చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. స్కూల్‌లో మంగళవారం స్టూడెంట్‌ను అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్చరల్ ప్రోగ్రామ్స్ విద్యార్థుల్లో మానసికోల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.