సెంటర్ ఫర్ ఫ్యూచర్ స్కిల్స్‌ ప్రారంభం

సెంటర్ ఫర్ ఫ్యూచర్ స్కిల్స్‌ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: యువతకు ఫలితాల ఆధారిత  అధిక-నాణ్యత నైపుణ్య శిక్షణను అందించడానికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్​ఎస్​డీఎస్​) బెంగళూరులోని ఎత్నోటెక్ అకడమిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సెంటర్ ఫర్ ఫ్యూచర్ స్కిల్స్‌ ప్రారంభించింది. కర్ణాటకలోని కలబురగిలో దీనిని ఏర్పాటు చేసింది.

ఇక్కడ స్టూడెంట్లకు హై క్వాలిటీ స్కిల్​ ట్రైనింగ్​ ఇస్తామని ఎన్​ఎస్​డీసీ తెలిపింది. సంప్రదాయ విద్యకు ఆధునిక కోర్సులను చేర్చుతామని తెలిపింది. నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీకి అనుగుణంగా నైపుణ్యాల కొరతను తీర్చుతామని, స్టూడెంట్లకు ఉపాధి అవకాశాలను పెంచుతామని పేర్కొంది. 

మరిన్ని వార్తలు