ఇన్వెస్టర్లకు పండగే.. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న భారీ IPO ఈనెలలోనే..? వివరాలు తెలుసుకోవాల్సిందే..!

ఇన్వెస్టర్లకు పండగే.. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న భారీ IPO ఈనెలలోనే..? వివరాలు తెలుసుకోవాల్సిందే..!

కొత్త సంవత్సరం 2025 ఆరంభం నుంచి బేర్ మార్కెట్ తో.. నష్టాలతో పూర్తిగా అసంతృప్తిలో ఉన్న ఇన్వెస్టర్లకు పండగ లాంటి వార్త. ఎప్పుడైతే ట్రంప్ గెలిచాడో.. అప్పటి నుంచి ఒకవైపు నష్టాల్లో మార్కెట్.. మరోవైపు పెద్ద ఐపీఓలు లేక నిరాశతో ఉన్న ఇన్వెస్టర్లకు ఇది నిజంగా మంచి వార్తే. మార్కెట్ ను ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న  IPO ఓపెనింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే  ఐపీఓను ఓపెన్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

స్టాక్ మార్కెట్ అడ్వైజరీ కంపెనీలైన CDSL, NSDL అంటే ఇన్వెస్టర్లకు ఎంతో ఆసక్తి. ఇప్పటికే CDSL మార్కెట్లో లిస్ట్ అయ్యి ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్ లో అడ్వైజరీ మార్కెట్ లో మార్కె్ట్ క్యాపిటలైజేషన్ ఆక్యుపై చేసిన ఈ రెండు కంపెనీలపై ఇన్వెస్టర్లకు స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అయితే ఒకటి లిస్ట్ అవ్వగా మరోటి ఐపీఓ ఓపెనింగ్ కు సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్ న్యూస్.

అతిపెద్ద మార్కెట్ కలిగిన NSDL ఐపీఓకు రంగం సిద్ధం చేసుకుంది. ఐపీఓ గా రావాలని సెబీ కి అప్పుడెప్పుడో డీఆర్ హెచ్ పీ సమర్పించింది కూడా. కానీ మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నందున కాస్త ఆలస్యం చేసింది. కానీ ఈ మార్చితో ఫైల్ చేసిన DRHP కి గడువు పూర్తవుతోంది. అందుకోసం గడువు లోగా ఐపీఓగా రావాలని నిర్ణయించినట్లు కంపెనీ అధికారి PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

మార్కెట్ కాస్త మెరుగుపడిన తర్వాత ఐపీఓ కి వద్దామనుకున్నా..  గడువు ముగుస్తుండటంతో ఈ నెలలోనే ఐపీఓ లాంచ్ కు సిద్ధమైంది కంపెనీ. మార్కెట్ ఎలా ఉన్నా.. కంపెనీకి మార్కెట్ లో ఉన్న డిమాండ్ చాలు లాభాల్లో లిస్ట్ అయ్యేందుకు.. ఇన్వెస్టర్లకు లాభాలు ఇచ్చేందుకు.. అని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. 2024 సెప్టెంబర్ లోనే కంపెనీ IPO కి సెబీ నుంచి అప్రూవల్ వచ్చింది. 

మొత్తం 3 వేల కోట్ల రూపాయల ఐపీఓ వస్తుండటం పెద్ద న్యూసే. అయితే ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS). నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE), ఐడీబీఐ, HDFC బ్యాంకులు తమ వాటాలను అమ్ముతుండటంతో ఐపీఓ రూపంలో మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది కంపెనీ. 

2024 అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్ లో దాదాపు 30 శాతం జంప్ కనిపించింది. అంటే ఈ క్వార్టర్ లో 85.8 కోట్ల రూపాయల లాభం వచ్చింది కంపెనీకి. గత ఏడాది ఇదే క్వార్టర్ లో రూ.66.09 కోట్ల ప్రాఫిట్ నుంచి ప్రస్తుతం 85.8 కోట్ల రూపాయల లాభం రావడం ప్లస్ పాయింట్ అంటున్నారు అనలిస్ట్ లు. Q3 FY25 లో  టోటల్ ఇన్ కమ్ 16.2 శాతం అంటే 391.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు కంపెనీ ఫలితాల ద్వారా తెలుస్తోంది. చూడాలి మరి కంపెనీ ఏ వాల్యుయేషన్ లో వస్తుందో. డిపాజిటరీ కంపెనీలు కాబట్టీ మార్కెట్ CDSL కు మంచి వాల్యుయేషన్ ఇచ్చింది. ఇన్వెస్టర్లకు లాభాలు కురిపించింది ఆ కంపెనీ. అదే బాటలో NSDL కూడా లాభాలు ఇస్తుందేమో చూడాలి.