న్యూఢిల్లీ: సెబీ ఆదేశాల మేరకు బ్యాంక్ నిఫ్టీ, మిడ్‌క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలపై వీక్లీ ఆప్షన్లను ఎన్‌ఎస్‌ఈ ఆపేస్తోంది. ఒక ఎక్స్చేంజ్ కేవలం ఒక ఇండెక్స్‌పైనే వీక్లీ ఆప్షన్లను అందివ్వాలని సెబీ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. వచ్చే నెల 20 నుంచి కేవలం నిఫ్టీ 50 పైనే వీక్లీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్, ఫిన్‌నిఫ్టీ మంత్లీ ఎక్స్‌పైరీ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లు అందుబాటులో ఉంటాయి.
బ్యాంక్ నిఫ్టీ చివరి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ వచ్చే నెల 13 న ఉండగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ చివరి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ నవంబర్ 18 న, ఫిన్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ చివరి తేది నవంబర్ 19 న ఉన్నాయి.