నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) దేశ సేవ, విరోచిత పోరాటాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్లాక్ క్యాట్స్గా పిలుచుకునే ఈ కమాండోల ధైర్య సాహసాలకు గుర్తుగా రూపొందించిన క్యాలెండర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎన్ఎస్జీ సేవల్ని ప్రశంసిస్తూ ఒక్కో నెల ఒక్కో కొటేషన్ తో డిజైన్ చేసిన ఈ క్యాలెండర్ చూసేందుకు అచ్చం యాక్షన్ మూవీ పోస్టర్స్ లా కనిపిస్తోంది.
సెవెన్త్ ఎడిషన్ హై ఓల్టేజ్ ఎన్ఎస్జీ క్యాలెండర్ ను ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ ప్రవీణ్ తలార్ రూపొందించారు. ఆయన తీసిన ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ బుక్ ఫెయిర్స్ లో ప్రదర్శించడంతో పాటు మేగజైన్స్ లో పబ్లిష్ చేశారు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టడంతో పాటు దేశ అంతర్గత భద్రతకు కాపాడేందుకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసే ఎన్ఎస్జీని ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత అక్టోబర్ 16,1984న ఏర్పాటు చేశారు.