హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మేజర్ కాల్వలకు ఎన్నెస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో ఎండిపోతున్న చెరువులను నింపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈనెల1 నుంచి నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మేజర్ కాల్వల పరిధిలో ఎండిపోతున్న వరి పంటను కాపాడాలని రైతులు ఆదివారం రాత్రి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిని కోరారు.
ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎడమకాల్వ మేజర్ పరిధిలోని రాజవరం, పేరూరు, సూరేపల్లి, ముది మాణిక్యం మేజర్ కాల్వలకు నీటిని విడుదల చేశారు.