కొండమల్లేపల్లి, చింతపల్లి, వెలుగు : ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మంగళవారం హైదరాబాద్ నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై చింతపల్లి మండల కేంద్రంలోని గోడు కొండ్ల వాటర్ ప్లాంట్ సమీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎస్సై రామ్మూర్తి సిబ్బందితో కలిసి బస్టాండ్ వద్ద సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు నెలల వరకు ఈ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ కొనసాగుతుందని దేవరకొండ డీఎస్పీ గిరిబాబు తెలిపారు.
రూ. మూడు లక్షల పట్టివేత
నార్కట్పల్లి, వెలుగు : లోక్సభ ఎన్నికల దృష్ట్యా నల్లగొండ జిల్లా నార్కట్పల్లి లోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా రూ. 3 లక్షల 45 వేల నగదు పట్టుబడ్డాయి. 74 వేల 460 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు.