చిట్యాలలో ఎన్ఎస్ఎస్ ​క్యాంప్

చిట్యాలలో  ఎన్ఎస్ఎస్ ​క్యాంప్

తాడ్వాయి, వెలుగు: తాడ్వాయి మండలం చిట్యాలలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్టూడెంట్లు మంగళవారం ఎన్ఎస్ఎస్​క్యాంప్​నిర్వహించారు. స్థానిక శివాలయం ప్రాంగణంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఆలయం చుట్టూ పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించారు.  ఆలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు మొరం పోసి చదును చేశారు. అనంతరం స్థానిక పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధి సాయిలుతో కలిసి గ్రామస్తులకు ధ్యానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ యూసుఫ్ హుస్సేన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సంగన్నగారి శ్రీకాంత్, సర్పంచ్ కవిత బాలయ్య, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.