కమలాపూర్, వెలుగు : గాలికుంటు వ్యాధి నివారణకు మూగజీవాలకు టీకాలు వేయించాలని ఎన్ఎస్ఎస్ టీం లీడర్ సంపత్ రైతులకు సూచించారు. శుక్రవారం వరంగల్ మామునూర్ పశు వైద్య కళాశాల నిపుణులు, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏడు రోజుల పశు ప్రత్యేక వైద్య శిబిరం, జాతీయ పశు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ టీం లీడర్ సంపత్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో 200కు పైగా ఆవులు, గేదెలకు వివిధ వ్యాధులకు, గర్భకోశ వ్యాధి చికిత్సలు, నట్టల నివారణ మందులు, గొంతు వాపు వ్యాధి టీకాలు ఇస్తున్నట్ల తెలిపారు. కార్యక్రమంలో మామునూరు క్యాంప్ వైద్య కళాశాల 30 మంది నిపుణులు, 20 మంది సిబ్బంది, గూడూరు గ్రామ మాజీ సర్పంచ్ అంకతి సాంబయ్య, ఎన్ఎస్ఎస్ టీం లీడర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.