
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో బుధవారం ఎన్ఎస్ యూఐ 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. యూనివర్సిటీ అధ్యక్షుడు పుట్టపాగ వంశీకుమార్ ఎన్ ఎస్ యూ ఐ జెండాను ఆవిష్కరించారు. పాలమూరు యూనివర్సిటీ కి లా, ఇంజనీరింగ్ కాలేజీలు రావడం ఎన్ఎస్ యూఐ పోరాట ఫలితమేనన్నారు. కనక విజయ, అఖిల, రవీందర్, శివ, గంట నరేశ్, అంజి, శ్రీను, సుభాన్ పాల్గొన్నారు.
ఆమనగల్లు: విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత ఎన్ఎస్ యూఐకే దక్కుతుందని ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ గీత, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బుధవారం కడ్తాల్ లో ఎన్ఎస్ యూఐ 55 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. జహంగీర్ అలీ, క్యామ రాజేశ్, షాబుద్దీన్, పరుశురాం, బోసు రవి, భాను కిరణ్ పాల్గొన్నారు.