కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత..అడుగడుగునా నిరసనలు

కరీంనగర్‭లో పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‭ను నిరసనకారులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పోలీసులు అప్రమత్తమై ముందస్తు అరెస్టు చేసినా కేటీఆర్‭కు నిరసన సెగ తప్పడం లేదు. తాజాగా హనుమకొండ జిల్లా కమలాపూర్ లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను ఎన్‭ఎస్‭యూఐ నేతలు అడ్డుకున్నారు. నల్ల చొక్కాలు ధరించి.. నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకారుల చొక్కాలు చింపి వారిపై దాడికి పాల్పడ్డారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.