నిజామాబాద్ సిటీ, వెలుగు: అసోంలో భారత్ జోడో న్యాయ యాత్రపై దాడిని ఖండిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం ఎన్ఎస్ యూఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ భవన్ నుంచి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఎన్ఎస్ యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు నిఖిల్ రెడ్డి, బోరుగుపల్లి శివ మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ యాత్రపై బీజేపీ గూండాల దాడిని ఖండిస్తున్నామని, తమ నాయకుడు అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే అది ప్రధాని మోదీ, అసోం సీఎం హిమంత బిశ్వశర్మకు మింగుడు పడడం లేదన్నారు. అందుకే దాడులు చేయిస్తున్నారన్నారు. ఎన్ఎస్ యూఐ జిల్లా నాయకులు శివ, విశాల్ రెడ్డి, సిరోజన్ రెడ్డి, చందు పాల్గొన్నారు.