JEE Mains 2025: జేఈఈ మెయిన్ 2025.. జనవరి సెషన్ నోటిఫికేషన్ విడుదల

JEE Mains 2025: జేఈఈ మెయిన్ 2025.. జనవరి సెషన్ నోటిఫికేషన్ విడుదల

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2025 పరీక్షకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. 2025-26 సంవత్సరానికిగానూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA),, జనవరి సెషన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సోమవారం అధికారికంగా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ : Govt Jobs: ఇంజినీరింగ్ చేసిన వారికి గుడ్‌న్యూస్.. కోల్ ఇండియాలో 640 ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియతో పాటు, పరీక్ష తేదీలను ఎన్ టీఏ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, జేఈఈ మెయిన్‌ సెషన్ -1 పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 22 నుండి జనవరి 31 వరకు జరుగుతాయి. ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ సహా 13 భాషలలో నిర్వహించనున్నారు. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inను సందర్శించండి.
హోమ్ పేజీలో JEE(Main) 2025 Session 1 Registration లింక్‌పై క్లిక్ చేయండి.
అనంతరం దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
పూర్తి చేసిన దరఖాస్తును సమర్పించండి.
చివరగా భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసుకోండి.