
ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
(ఎన్టీపీసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు 400: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) (యూఆర్–172, ఈడబ్ల్యూఎస్–140, ఓబీసీ–82, ఎస్సీ–66, ఎస్టీ–40) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రికల్) 40శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. వయోపరిమితి 35ఏండ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్ల సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: 2025, మార్చి 1.