సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. పెద్ద పల్లి జిల్లా రామగుండానికి చెందిన ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎన్టీపీసీ లేబర్ గేట్నుంచి రాజీవ్ రహదారి వరకు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు.
Also Read : ఐదేళ్ల వయస్సులోనే మొబైల్ కు బానిస.. నిద్రలోనూ వీడియోలు స్క్రోల్ చేస్తూ..
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2018 లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం.. రెగ్యలరైజ్, తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటం ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.