మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్ అందుతోంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ 475 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/B Tech పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. NTPC కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక, ఇందులో ఉద్యోగం కొడితే లైఫ్ సెటిలైనట్టే. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 475
- ఎలక్ట్రికల్: 135
- మెకానికల్: 180
- ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్: 85
- సివిల్: 50
- మైనింగ్: 25
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BE/B.Tech ఉతీర్ణులై ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులు 55 శాతం.. ఇతరులు కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. దాంతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా గేట్(GATE 2024) పరీక్షకు హాజరై ఉండాలి.
వయో పరిమితి: 27 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ EWS/ ఓబీసీ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. SC/ST/PwBD/Ex Servicemen/ మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
జీతభత్యాలు: ఎంపికైన వారు నెలకు రూ.40వేల నుండి లక్షా 40వేల మధ్య వేతనం అందుకుంటారు. జీతంతో పాటు కంపెనీ పాలసీలకు అనుగుణంగా డియర్‌నెస్ అలవెన్స్, అదనపు అలవెన్సులు పొందుతారు.
ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక పోస్టింగ్ ఇస్తారు. ఎక్కడ పోస్టింగ్ అనేది అప్పుడు నిర్ణయిస్తారు. ఎక్కడైనా.. ఏ షిఫ్టులోనైనా పనిచేసేందుకు అభ్యర్థులు సంసిద్ధంగా ఉండాలి. అందుకు అభ్యర్థి ముందుగానే సమ్మతి తెలపాల్సి ఉంటుంది.
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: జనవరి 30, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2025