చార్మినార్​ బ్యూటిఫికేషన్కు ఎన్టీపీసీ నిధులు

చార్మినార్​ బ్యూటిఫికేషన్కు ఎన్టీపీసీ నిధులు
  • జీహెచ్ఎంసీతో ఎంఓయూ

పద్మారావునగర్, వెలుగు: స్వచ్ఛ ఐకానిక్​ప్లేసెస్​ప్రాజెక్టు కింద చార్మినార్ బ్యూటిఫికేషన్​పనులకు ఫండ్స్ ఇచ్చేందుకు ఎన్టీపీసీ సంస్థ ముందుకొచ్చింది. జీహెచ్ఎంసీతో ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం ఇరు సంస్థల ప్రతినిధులు కవాడిగూడ లోని ఎన్టీపీసీ సౌత్​ రీజియన్​హెడ్ క్వార్టర్ ఆఫీసులో ఎంఓయూలపై సంతకాలు చేశారు. ఎన్టీపీసీ ఏజీఎం అఖిల్​పట్నాయక్​, కులీకుత్​బ్ షా అర్బన్​ డెవలప్​మెంట్ అథారిటీ చీఫ్​ ఇంజనీర్ జి.గురువీర సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. సీఎస్ఆర్​కింద ఎన్టీపీసీ నిధులు సమకూర్చనుండగా, పనులను జీహెచ్ఎంసీ చేపట్టనుంది.