న్యూఢిల్లీ: ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ నవంబర్ 19 న ఓపెనై, 22 న ముగియనుంది. ఫేస్ వాల్యూ రూ.10 ఉన్న ఒక్కో షేరుని రూ.102–108 ప్రైస్ రేంజ్‌లో అమ్మనున్నారు. ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ ఇన్వెస్టర్లు కనీసం రూ.138 షేర్ల కోసం బిడ్ వేయాల్సి ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్ నవంబర్ 25 న ఉండొచ్చు. లిస్టింగ్ నవంబర్ 27 జరుగుతుందని అంచనా. మరోవైపు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో లామోసైక్ ఇండియా ఐపీఓ నవంబర్ 21 ఓపెన్ అవుతుంది. నవంబర్ 26 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ రూ.61.2 కోట్లను సేకరించాలని చూస్తోంది.
ఒక్కో షేరుని రూ.200 కి అమ్ముతున్నారు. కనీసం 600 షేర్ల కోసం రూ.1,20,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 29 న ఈ కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎమర్జింగ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్టింగ్ అవుతాయి. సీ2సీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఐపీఓ నవంబర్ 22 న ఇన్వెస్టర్ల ముందుకు రానుంది. ఒక్కో షేరుని రూ.214–226 రేంజ్‌లో అమ్ముతున్నారు.