ఎన్‌‌‌‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. లక్ష కోట్ల పెట్టుబడి

ఎన్‌‌‌‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. లక్ష కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: ఎన్‌‌‌‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ  2026–27 నాటికి   రూ.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. సోలార్‌‌‌‌‌‌‌‌, విండ్ ఎనర్జీ సెగ్మెంట్‌‌‌‌లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఐపీఓకి వస్తున్న ఈ కంపెనీ, ఫ్రెష్‌‌‌‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.10 వేల కోట్లను సేకరించనుంది. ఈ ఫండ్స్‌‌‌‌ను తన సోలార్‌‌‌‌‌‌‌‌, విండ్ ఎనర్జీ అసెట్స్‌‌‌‌ను పెంచుకోవడానికి ఇన్వెస్ట్ చేయనుంది.   రూ. లక్ష కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో  20 శాతం అమౌంట్‌ను షేర్లను అమ్మడం ద్వారా సేకరిస్తామని ఎన్‌‌‌‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ చైర్మన్ గుర్దీప్‌‌‌‌ సింగ్ పేర్కొన్నారు.

 బిజినెస్ విస్తరణకు మరో రూ. 20 వేల కోట్లు అవసరమని తెలిపారు. ఇతర ఫండ్స్‌‌‌‌ను ఇంటర్నల్‌‌‌‌గా సేకరిస్తామని వివరించారు.  ఎన్‌‌‌‌టీపీసీ గ్రీన్ ఎనర్జీకి 3,220 మెగా వాట్ల ఇన్‌‌‌‌స్టాల్డ్‌‌‌‌ కెపాసిటీ ఉంది. దీనిని 2025 మార్చి నాటికి 6 వేల మెగా వాట్లకు, 2026 నాటికి 11 వేల మెగా వాట్లకు, 2027 నాటికి 19 వేల మెగావాట్లకు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. 11 వేల మెగావాట్ల కెపాసిటీ ఉండే వివిధ ప్రాజెక్ట్‌‌‌‌లు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి.  కంపెనీ ఆపరేట్ చేస్తున్న గ్రీన్ ఎనర్జీలో 90 శాతం సోలార్ ఉంది. ఒక్కో మెగా వాట్ సోలార్ ఎనర్జీ కోసం రూ.5 కోట్లు, ఒక్కో మెగా వాట్ విండ్ ఎనర్జీ  కోసం రూ.8 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు.  

19 నుంచి ఎన్‌‌‌‌టీపీసీ  గ్రీన్ ఎనర్జీ ఐపీఓ 

ఎన్‌‌‌‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ  ఈ నెల 19 న ఓపెనై, 22 న ముగియనుంది. ఒక్కో షేరుని రూ.102–108 ప్రైస్ రేంజ్‌‌‌‌లో అమ్మనున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 138 షేర్ల కోసం బిడ్ వేయాల్సి ఉంటుంది. ఎన్‌‌‌‌టీపీసీ గ్రీన్ ఎనర్జీలో పేరెంట్ కంపెనీ ఎన్‌‌‌‌టీపీసీ రూ.7,500 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని గుర్దీప్ సింగ్ అన్నారు. కాగా,  తాజా ఐపీఓలో ఎన్‌‌‌‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాల్యుయేషన్  రూ. లక్ష కోట్లు ఉంది.