నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 50 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 27 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. జీతం నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
అప్లికేషన్స్ : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. వివరాలకు www.ntpc.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.