
ఎన్‌టీపీసీ లిమిటెడ్ 495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన గ్రాడ్యుయేట్ ఇంజినీర్ల నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత : కనీసం 65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55శాతం) బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023కి హాజరై ఉండాలి. వయసు 27 సంవత్సరాలు మించరాదు.
సెలెక్షన్ : గేట్-2023 స్కోరు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.careers.ntpc.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.