
ఎన్‌టీపీసీ మైనింగ్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
ఖాళీలు : మొత్తం 114 ఖాళీల్లో మైనింగ్ ఓవర్‌మ్యాన్: 52, మ్యాగజైన్ ఇంఛార్జ్: 7, మెకానికల్ సూపర్‌వైజర్: 21, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్: 13, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 3, జూనియర్ మైన్ సర్వేయర్: 11, మైనింగ్
సర్దార్ : 7 పోస్టులు ఉన్నాయి.
అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, స్కిల్/ కాంపిటెన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.ntpc.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.