ఎన్టీపీసీలో 9వేల 697 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి

జ్యోతి నగర్, వెలుగు: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో అక్టోబర్  వరకు 9,697 మిలియన్ల  యూనిట్ల విద్యుత్  ఉత్పత్తి చేశారు. 79.04 శాతం పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) పూర్తి చేశామని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 7 యూనిట్లలో 2010 మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు. ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ సూపర్  థర్మల్ పవర్  ప్రాజెక్ట్ లోని 800 మెగావాట్ల యూనిట్‌‌లో విద్యుత్  ఉత్పత్తికి 4 రోజుల కింద అంతరాయం కలిగిందని, బూడిద వెళ్లే మార్గంలో లీకేజీ కావడంతో  సాంకేతిక లోపం తలెత్తిందని వివరించారు. ప్రస్తుతం రిపేర్​ పనులు చేస్తున్నామని, ఉత్పత్తికి టైం పట్టే అవకాశం ఉందని చెప్పారు.