ఎన్టీపీసీకి సౌర్ ఎనర్జీ ఆవార్డ్

జ్యోతినగర్,వెలుగు: రామగుండం ఎన్టీపీసీ కి సౌర్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అవార్డ్ లభించింది.శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన  సోలార్ ట్రైల్ బ్లేజర్స్ కాన్ఫరెన్స్ లో   సౌర్ ఎనర్జీ గ్రూప్ ఎడిటర్ ప్రసన్నసింగ్  అవార్డును రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సీజీఎం కేదార్ రంజన్ పాండేకు అందజేశారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన 100 మెగావాట్ల ప్రాజెక్ట్ వాణిజ్యపరంగా సక్సెస్​అయిన సందర్భంగా అవార్డ్ రావడం  పట్ల హర్షం వ్యక్తం చేశారు.